కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు రకాల స్కీం లలో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన , ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేవి కూడా ఉన్నాయి. జీవన జ్యోతి బీమా యోజన ద్వారా రెండు లక్షల బీమా డబ్బులు లభిస్తాయి. పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే, ఆ డబ్బులు ఆయన కుటుంబ సభ్యులకు వర్తిస్తాయి. ఒకవేళ కరోనా వల్ల చనిపోయిన కూడా ఈ రెండు లక్షలు లభిస్తాయి. అయితే ఈ స్కీమ్ లో చేరినవారు ఏడాదికి 350 రూపాయలు కట్టాలి..సురక్ష బీమా యోజన స్కీమ్ కింద కూడా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ను పొందవచ్చు. ఇందులో ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా పాలసీ డబ్బులు వస్తాయి. అయితే ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ.12 కట్టాల్సి ఉంటుంది.