మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా 2018 - 2019 ఆర్థిక సంవత్సరానికి గాను, వారు సంపాదించిన మొత్తంలో కేవలం సీఎస్ఆర్ కోసం రూ.93.50 కోట్లను ఖర్చు చేసింది.ఆనంద్ మహీంద్ర 1996లోనే నాన్సీ కాశీ పేరిట ఒక ప్రాజెక్టును ప్రారంభించారు.ఇక ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆడ పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం. ఇక ఎవరైతే పేదరికంతో జీవితం గడుపుతున్నారో అలాంటి వారిలో ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఆడ పిల్లలకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారికి కావలసిన అవసరాలను తీర్చడం. ఇక అంతే కాదు ఆడపిల్లల కుటుంబాలకు కూడా తమ సహకారాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.