ముత్యాల సాగు వల్ల లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కొక్క ముత్యపు ధర రూ.300 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. ఇక మెరుగైన నాణ్యత కలిగిన ముత్యము విలువ అంతర్జాతీయ మార్కెట్లో పది వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. సగటున ఒక ముత్యానికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకున్నా, వంద ముత్యాలకు మీరు లక్ష రూపాయలను సంపాదించవచ్చు.