2020 -2021 సంవత్సరం లో కరోనా మహమ్మారి ప్రభావంతో వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో చిన్న వ్యాపారుల నుండి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కరు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. పల్లెల నుండి పట్టణాల వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు కనిపించాయి. అయితే ఇలాంటి సమయంలోనే వ్యాపార సంఘాలు పాజిటివ్ ఆలోచనలతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మహతి మార్కెట్ ఎసెన్షియల్జ్ ఎల్ ఎల్ పీ అనే సంస్థ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ సాయంతో కలిసి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వ్యాపారుల వరకు ప్రతి వ్యాపారవేత్తలు, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు వ్యాపారవృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలను అందిచనుంది.