కొత్తగా స్టార్ట్ అప్ లను ప్రారంభించాలని అనుకుంటున్నారా.. ? వ్యాపార రంగంలో మీ సొంత కాళ్లపై మీరు ఎదగాలని ఆశపడుతున్నారు.. ? మీకు బిజినెస్ లో ఎలాంటి అనుభవం లేదా.. ? అయితే అలాంటి వారి కోసమే మహతి మార్కెట్ ఎసెన్షియల్జ్ ఎల్ ఎల్ పీ అనే సంస్థ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ తో కలిసి గోల్డెన్ ఛాన్స్ ను తీసుకువచ్చింది. కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న వారికోసం వ్యాపారంలో నష్టపోయినవారికోసం బిజినెస్ మారథాన్ ను నిర్వవిస్తోంది. ఈ సమావేశంను ఆగస్టు 6 ,7వ తేదీలలో 250 పైగా వ్యాపారవేత్తల తో హైదరాబాద్ లోని హోటల్ నోవెటల్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే వ్యాపారవేత్తలు కొత్తగా బిజినెస్ ను ప్రారంభించాలని అనుకునే వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరు అవుతారు.