మహతి నెట్ వర్కింగ్ మారథాన్ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం చైర్మెన్ ఉప్పుట్ల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..నెట్ వర్కింగ్ మారథాన్ అనేది ఓ మంచి కార్యక్రమం అని అన్నారు. రకరకాల వ్యాపారాలు చేసేవారు ఈ కార్యక్రమం ద్యారా ఒక్క చోట చేర్చారని అన్నారు. బిజినెస్ అనేది ఎలా చేయాలి..ఎలా చేస్తే లాభాలు ఉంటాయో చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కరోనా పాండమిక్ కారణంగా వ్యాపారంలో రెండేళ్లుగా అంతా వెనకబడి పోయారని అన్నారు. చిన్న పాన్ షాప్ నుండి పెద్ద వ్యాపారస్థుల వరకూ అందరూ ఇబ్బందులు ఎదురుర్కొన్నారని చెప్పారు. ఇక థర్డ్ వేవ్ రాకూడదని తాను దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. త్వరలోనే వ్యాపారాలు బాగుంటాయని తాను కోరుకుంటున్నాని అన్నారు.