జియో డిస్కౌంట్ ఆఫర్లు

Suma Kallamadi
గత నెలలో ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం భారతదేశ నంబర్ వన్ టెలికాం సంస్థ జియో తీవ్రమైన విమర్శలను ఎదురుకోవడం జరిగింది. ఇక వినియోగదారులు, నెటిజన్లు జియోపై ఆగ్రహం వ్యక్తం  చేయడం కూడా జరిగింది. పోటీ సంస్థలు జియోను వెక్కిరించేలా ప్రకటనలు కూడా చేయడం జరిగింది. దీంతో ప్రారంభమైన మూడేళ్లలో తొలిసారి జియో వెనకంజ వేసినట్లు కనిపించింది. దీంతో జియో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది. తన రీచార్జీలపై క్యాష్ బ్యాక్ లు అందించడం మొదలు పెట్టింది.


జియో నెట్ వర్క్ నుంచి వేరే నెట్ వర్క్ కు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసల చార్జీలు విధిస్తామని జియో వెల్లడించిన అనంతరం దానికి తగ్గట్లు ఉచిత నాన్ జియో నిమిషాలతో ఆల్ ఇన్ వన్ ప్లాన్లను విడుదల చేసింది. రూ.222, రూ.333, రూ.444, రూ.555 ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 1,000 నుంచి 3,000 వరకు ఉచిత నిమిషాలను జియో అందించ పోతుంది. ఇప్పుడు తాజాగా ఇందులో ఉన్న రూ.444, రూ.555 ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా విడుదల చేసింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.444 ప్లాన్ పై రూ.44, రూ.555 ప్లాన్ పై రూ.50 తగ్గింపు వస్తుంది అని తెలిపింది  సంస్థ.


ఆ డిస్కౌంట్ ఆఫర్లను పొందడానికి ఈ కింద తెలిపిన ప్రక్రియను ద్వారా సులువుగా పొందవచ్చు..మొదట  మీ ఫోన్ లో పేటీయం యాప్ ఓపెన్ చేయండి.  అందులో మొబైల్ రీచార్జ్ పై క్లిక్ చేయండి.  అక్కడ మీ మొబైల్ నంబర్, సర్వీస్ ఆపరేటర్ ను అందించిన అనంతరం కింద ఉన్న Proceed అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే  మీరు ఇంకో పేజీకి వెళ్తారు. అక్కడ రూ.444, రూ.555 ప్లాన్లలో మీకు కావాల్సిన ప్లాన్ల ఎంపిక చేసుకోండి.


కింద ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటే దాన్ని డిసేబుల్ చేయండి. అనంతరం కింద ఉన్న Proceed to Rechargeపై క్లిక్ చేయండి.  అప్పుడు మీకు వెంటనే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కింద భాగంలో ‘Apply Promocode’ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ప్రోమో కోడ్ ను అందించాలి.


ఒకవేళ మీరు రూ.444తో రీచార్జ్ చేస్తున్నట్లయితే SHUBHP44 అనే ప్రోమోకోడ్ ను, రూ.555తో రీచార్జ్ చేస్తున్నట్లయితే SHUBHP50 అనే ప్రోమో కోడ్ ను వాడాలి. రూ.444 ప్లాన్ పై రూ.444, రూ.555 ప్లాన్ పై రూ.50 తగ్గింపు లభించనుంది. ఈ మొత్తం మీకు డిస్కౌంట్ రూపంలో కాకుండా క్యాష్ బ్యాక్ రూపంలోనే లభిస్తుంది. తర్వాత  అనంతరం కింద ‘Proceed to Pay’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా పేమెంట్ ను పూర్తి చేసి.. రీచార్జ్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: