సాధారణంగా వేసవికాలంలో ఏసీ, ఫ్రిజ్, టీవీ లాంటి వస్తువులు భారీ స్థాయిలో అమ్ముడవుతాయి. కానీ దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది కoపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగగా కరోనా దెబ్బకు ఈ ఏడాది అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కంపెనీలు అమ్మకాలు తగ్గుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి.
కరోనా ప్రభావంతో ఏసీ, టీవీ కంపెనీల భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. దేశంలో వచ్చే నెల 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో కంపెనీలు, ఏసీ, ఫ్రిజ్ ల అమ్మకాలపై ఆశలు వదిలేసుకున్నాయి. దైకిన్ ఇండియా ఎమ్‌డీ కన్వల్జిత్ జావా మాట్లాడుతూ కరోనా భవిష్యత్తులో అమ్మకాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని వ్యాఖ్యలు చేశారు. కరోనా కల్లోలం ఇదే విధంగా కొనసాగితే టీవీ, ఫ్రిజ్, ఏసీల విడిభాగాల ఖరీదు 25 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్రం ఇప్పటికే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, మోటార్లు, కంప్రెసర్లపై సుంకాలను పెంచింది. పరిశ్రమ వర్గాలు 32 అంగుళాలకు మించిన టీవీల ధరలు వచ్చే నెల నుంచి 15 శాతానికి పైగా పెరుగుతాయని చెబుతున్నాయి. జీఎస్టీ పెరగడం, రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల టీవీ, ఫ్రిజ్, ఏసీల ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple