ఇక వైరల్ అవుతున్న విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం కరెంటు బిల్లును మాఫీ చేసిందనే వార్త బాగా చెక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా సెప్టెంబర్ 1 నుంచి ఎవ్వరూ కరెంటు బిల్లు కట్టక్కర్లేదని అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వ్యాపిస్తోంది. అయితే వార్త పూర్తిగా అవాస్తవం. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతోందని తెలియజేశారు.
అంతేకాకుండా ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బిల్లు మాఫీ 2020 స్కీమ్‌ను తీసుకువచ్చిందని ఉందని నిపుణులు వెల్లడించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని ప్రతి కుటుంబం కరెంటు బిల్లు మాఫీ అవుతుందని తెలిపారు. అయితే ఇది నిజం కాదు. పూర్తిగా అబద్ధం. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తాజాగా ఇలాంటి స్కీమ్స్ ఏవీ అందుబాటులో లేవని తెలిపిందని తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం కరెంటు బిల్లు మాఫీ పథకాన్ని తీసుకురాలేదని తెలిపారు. ఈ విషయం ఫేక్ అని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇలాంటి ఫేక్ విషయాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనీ మీ వివరాలు కోరితే తెలియజేయవద్దని తెలిపింది. లేదంటే మోసపోవాల్సి వస్తుందని పేర్కొందని తెలిపారు.