చైనా పైకి అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది గాని దానిని ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వెంటాడుతుందని తెలుస్తుంది. గోల్డెన్ సాక్స్ లెక్కల ప్రకారం 8.5 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయట దానికి. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం 10 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయని తెలుస్తుంది.  అయితే చైనాలో ఇఃత ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడ ప్రొవిన్స్ కి సంబంధించిన వాళ్ళు చేసిన అప్పులేనని తెలుస్తుంది.


మనం ఇక్కడ రాష్ట్రాలు అని పిలబడే ప్రదేశాలనే వాళ్ళు అక్కడ ప్రావిన్సులని పిలుస్తారు. జిడిపి ప్రకారం పోల్చుకుంటే చైనా జిడిపి 12 ట్రిలియన్ డాలర్లు అయితే ఈ అప్పు 10ట్రిలియన్ డాలర్లు అని తెలుస్తుంది. ఇవి కూడా పరిగణనలోకి రానటువంటి అప్పులట. అక్కడ పరిపాలించేవన్నీ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలే. అయితే వీళ్ళు తక్షణ సహాయం కోసం ఒక విధానాన్ని ప్రవేశపెట్టారట.


దాని పేరే ఎల్ జి ఎఫ్ బి. ఈ ఎల్ జి ఎఫ్ బి అంటే అర్థం ఏమిటంటే లోకల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్ అని తెలుస్తుంది. ఈ లోకల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్ ప్రొసీజర్ ఏమిటంటే  ప్రజలు తమ డబ్బును ఈ బ్యాంక్స్ లో దాచుకోవాలట. దాచుకున్న వాటికి వాళ్ళు వడ్డీలు ఇస్తారట. అయితే ప్రజలు దాచుకున్న సొమ్మును వీళ్ళు ప్రభుత్వ అవసరాల కోసం వాడుతూ ఉంటారని తెలుస్తుంది.


తిరిగి వాటిని వచ్చే పన్నుల నుండి ప్రజలు తీసుకోవచ్చని ఒక లెక్క. అయితే అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాలు ప్రజల డబ్బును అయితే వాడేసేయి గానీ వాళ్లకి తిరిగి చెల్లించలేదట. చైనాకు సంబంధించిన 11 ప్రోవిన్సుల్లోని ప్రజలకు ఇదే పరిస్థితి ఆట. ఇంకా ముఖ్యంగా ఆరు ప్రావిన్సుల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలుస్తుంది. ఈ ప్రాంతాలకు సంబంధించి విజు రీజియన్ ఒకటే 3 ట్రిలియన్ ల డాలర్లు అప్పులో ఉందని తెలుస్తుంది. దాంతో మళ్లీ ఆ డబ్బును కూడా ప్రజలు నుండే పిండుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: