చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు అనేక రకాల మెడిసిన్స్ వాడిన కాని వారికి తాత్కాలికంగా మాత్రమే ఫలితం ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదు. కాబట్టి దగ్గు, జలుబు లకు శాశ్వత మార్గం మిరియాల రసం. ఇది దక్షిణ భారత దేశంలో ఒక మంచి ఆరోగ్యకరమైన వంటకం. జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఇది సరైన పరిహారంగా వాడుకలో ఉన్న ఉత్తమమైన వంటకం ఈ మిరియాల రసం. దీనిని వాడుక భాషలో మిరియాల చారుగా కూడా వ్యవహరిస్తారు.