చికెన్ పకోడీ తయారు చేసే విధానం... ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, గుడ్లు, తురిమిన వెల్లుల్లి, అల్లం, కరివేపాకులు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంగువ, బేకింగ్ పౌడర్ మిగిలిన అన్నీ పదార్థాలు వేయాలి. ఇప్పుడు వాటిలో నీరు పోసి బాగా కలపాలి. అందులో చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫ్రిజ్లో 30 నిమిషాల వరకూ పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు నూనె వేడి కాగానే చికెన్ మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి.. ఇవి బంగారు రంగులోకి మారేవరకూ వేయించాలి.