పోహా తయారీకి.. ముందుగా అటుకులను శుభ్రమైన నీటితో కడగండి. ఆ తర్వాత నీరు లేకుండా నెమ్మదిగా పిండి పక్కన పెట్టండి. మీ ఇంట్లో జల్లెడలాంటి పాత్ర ఏదైనా ఉంటే నీరు ఇంకే వరకు అందులో పెట్టవచ్చు. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. అది లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి తగినంత నూనె వేడి చేయండి.ఆ తర్వాత జీలకర్ర, వేరుశెనగ పప్పు, పచ్చి మిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.చివర్లో ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణిలు వేసి కాసేపు వేయించండి.ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేసి బాగా కలపండి. అటుకులు వేగేప్పుడు స్టవ్ ఆన్‌లోనే ఉండాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని అటుకుల్లో వేయండి.నిమ్మరసం అంతా అటుకుల్లో బాగా కలిసేలా కలపండి.