రుచికరమైన మీఠా పారే కోసం.. ఒక గిన్నెను తీసుకుని, అందులో నీరు, చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర పూర్తిగా నీటిలో కరిగేవరకు కలపండి. ఈ మిశ్రమంలో నెయ్యిని వేసి 3 నుండి 4 నిమిషాలపాటు మళ్లీ కలపండి. ఆపై అందులో మైదాని వేసి మెత్తని పిండిగా తయారుచేసుకోండి. ఈ పిండి మెత్తగా మారిన తర్వాత, 1 నుండి ఒకటిన్నర గంటల పాటు పక్కన ఉంచండి. కొంత సమయం తరువాత, రోలింగ్ ప్లేట్ (చపాతీ పీట) మీద పిండిని వేసి, పిండిని చిన్ని చిన్ని భాగాలుగా తయారు చేయండి. రోలింగ్ పిన్‌కు నూనె రాసి, పిండిని మందంగా ఫ్లాట్‌బ్రెడ్ లా చేయండి. ఈ ఫ్లాట్ బ్రెడ్ ను మీరు కోరుకున్న ఆకారంలో కట్ చేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు పాన్‌లో వేయించండి.