బజ్జీ తయారుచేయు విధానం... ముందుగా ఓ బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయండి, వీటన్నింటిని ముందుగానే ఓ సారి కలపండి.ఇప్పుడు పిండి మిశ్రమంలో ఓ స్పూన్ ఆయిల్ వేసి మరోసారి కలపండి. ఇందులో నీరు పోసి బజ్జీల పిండిలా కలపండి.ఇప్పుడు పచ్చి మిర్చిలకు మధ్యలో చీల్చండి.. ఇప్పుడు మధ్యలో కొద్దిగా కారం రాయండి. ఇలా చేయడం వల్ల బజ్జీలు స్పైసీగా, టేస్టీగా వస్తాయి.ఇప్పుడు పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయండి.నూనె వేడి అయిన తర్వాత మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేయండి. వీటిని కాస్తా దోరగా వేయించండి.వీటిని వేడివేడిగా టమాటా సాస్‌తో కానీ, ఉల్లిపాయ కాంబినేషన్‌తో తింటచే చాలా బావుంటాయి.