మిక్సీ లోకి నానపెట్టుకున్నసెనగ పప్పు మరియు పచ్చి మిరపకాయలు వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ తయారు చేసుకోవాలి ( ఈ పేస్ట్ మరి మెత్తగా అవకుండా కచ్చా పచ్చగా ఉండేటట్లు చూసుకోండి. )గిన్నెను తీసుకోని దానిలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తో పాటుగా అందులోనే కొత్తిమీర ఆకులు, కరివేపాకు ఆకులు, పసుపు ,పుదీనా ఆకులు మరియు అల్లం తురుము వేసుకొని అన్ని పదార్దాలని చక్కగా కలుపుకోవాలి.ఒక కాలాయిని తీసుకోని అందులో నూనె పోసుకొని వేడిచేసుకోవాలి. నూనె కాగిన తరువాత, ఇంతకముందు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గుండ్రగా వడల ఆకారం లో చేసుకొని కాగుతున్న నూనె లో వేసుకోవాలి. మసాలా వడలను 2 నుంచి 3 నిముషాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరుకు బాగా వేయించుకోండి.అంతే ..మసాలా వడలు రెడీ అయిపోయాయి వీటిని టీ టైం లో సైడ్ స్నాక్ లాగా లేదా ఏదైనా చట్నీలోకి లేదా సాస్ లోకి నంచుకుని తినవచ్చు.