క్యారెట్, ముల్లంగి ఆవకాయ తయారు చేయు విధానం చూడండి .... బాణలిలో ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇందులో మెంతి గింజలను, జీలకర్రను వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఆపై ధనియాలు, సోపు గింజలును వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి.ఈ మసాలాలు చల్లబడిన తర్వాత, మిక్సర్లో పొడిగా చేయండి.ఒక బాణలిలో నూనె, ఇంగువ, పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్ అన్నిటినీ వేసి బాగా వేయించాలి. ఆపై పసుపు, కారం, అజ్వైన్, ఆమ్చూర్ పౌడర్ వేసి అన్ని పదార్థాలను మళ్లీ కలపాలి.బాణలిలో పైన చేసిన మసాల పొడికి, ఉప్పు వేసి తక్కువ మంట మీద వేయించాలి.అది చల్లబడిన తర్వాత, ఒక జార్లో దీన్ని భద్రపరుచుకోండి, దీనిని వేడి అన్నంతోనే కాకుండా, మీకు నచ్చిన రోటీ లేదా నాన్ తో తీసుకోవచ్చు.