అరటిపువ్వు వడ తయారు చేయు విధానం.... మిక్సీలో సెనగపప్పు, తరిగిన ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నిటినీ పేస్టులా మిక్సీపట్టండి.అరటిపువ్వును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.ఒక పెద్ద గిన్నెలోకి రుబ్బిన పేస్టును తీసుకుని తరిగిన అరటిపువ్వును కలపండి.తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు, జీలకర్ర, కొత్తిమీర ఇంకా ఉప్పును వేయండి. అన్ని పదార్థాలను చక్కగా కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముద్దని తీసుకుని వడ ఆకారంలో చేతిమీద అద్దుకోండి.ఒక పెనంలో నూనె వేసి వేడిచేయండి. నూనె మరిగాక, అరటిపువ్వు వడ మిశ్రమాన్ని నూనెలో వేసి బంగారు రంగులోకి మారేవరకూ వేయించండి.చట్నీతో వేడిగా వడలను వడ్డించండి లేదా టీ సమయంలో టీతోపాటు ఆనందించండి.