ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి మెత్తగా పేస్టులా చేయాలి.  ఇప్పుడు ఓ పాన్ తీసుకుని అందులోనే నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అందులోనే కరివేపాకులు వేసి అనంతరం క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఉప్పు వేసి క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించాలి.  అవసరం అనుకుంటే మరికాస్తా ఉప్పు వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి మరోసారి బాగా కలపాలి.   ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి తయారైన డిష్‌ని చల్లబడే వరకూ వెయిట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో మిశ్రమాన్ని వేసి పెరుగుని వేసి బాగా కలపండి. పై నుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైతా తయారైనట్లే. ఇది బిర్యానీ, పులావ్‌లోకి మంచి సైడ్ డిష్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.....