చిక్కుడుగింజల చట్నీ తయారుచేయు విధానం చూడండి.... మిక్సీ జార్ ని తీసుకోని అందులోకి కొబ్బరి తురుము , జీలకర్ర, మిరియాలు, అల్లం మరియు పచ్చి మిరపకాలయను వేసుకొని కొద్దిగా గట్టి పేస్ట్ ని తయారు చేసుకోండి.ఒక పాన్ ని తీసుకొని కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేయండి. నూనె కాగిన తరువాత ఆవాలు, ఇంగువ మరియు కరోవేపాకును వేసికొని 2-3 నిముషాలపాటు వేయించుకోండి. ఉడికించిన చిక్కుడు గింజలను తీసుకోని ఒక పాన్ లోకి వేసుకొని కొంచెం సేపు వేయుంచుకోండి.ఇంతక ముందు మిక్సీ లో తయారు చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకోని అదే పాన్ లో వేసి బాగా కలుపుకోవాలి. ఇపుడు కావలసినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి, ఇలా కలిపిన తరువాత 2-3 నిముషాలు ఈ పదార్దాలను ఉడికించుకోవాలి.అంతే..ఎంతో రుచికరమైన చిక్కుడు గింజల చట్నీ రెసిపీ తయారైపోయింది.ఇది వేడి - వేడి అన్నంలో లేదా చపాతీకి చాలా బాగుంటుంది.