రస్క్ పాయసం తయారు చేసే విధానం...... ముందుగా రస్క్‌లను తీసుకుని మిక్సీజార్‌లో వేసి పొడి చేయండి. ఆ తర్వాత ఓ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి చిన్న మంటపై వేడిచేయండి. నెయ్యి వేడి కాగానే జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేయించండి.ఓ 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత క్రష్ చేసిన రస్క్‌ని వేసి వేయించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయించండి. ఆ తర్వాత అందులో పాలు వేయండి. అనంతరం ఉండలు లేకుండా బాగా కలపండి..ఇప్పుడు మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమం పాయసంలా ఇలా తయారవుతుంది.ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించండి.ఇలా తయారైన పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత పై నుంచి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి. ఇలా తయారైన వేడివేడిగా సర్వ్ చేయండి.