నోరూరించే వేగన్ కుకీస్ తయారు చేయు విధానం చూడండి... ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఓట్స్, కొబ్బరి తురుము వేసి బరక గా పొడి కొట్టండి...ఇప్పుడు ఇందులో పండిన అరటి పండ్లని కలపండి. ఇందువల్ల కుకీస్ కి నాచురల్ గా తియ్యదనం వస్తుంది.మీ దగ్గర చిన్న బ్లెండర్ ఉంటే కలిపేముందు అరటి పండ్లని మాష్ చేయండి.థిక్ వైట్ పేస్ట్ వచ్చే వరకూ వీటిని కలపండి.ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని అందులో పార్చ్మెంట్ షీట్ పరవండి.ఈ షీట్ మీద ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ చొప్పున ఉంచండి.160 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒవెన్ లో ఇరవై నిమిషాల పాటూ బేక్ చేయండి. బాగా క్రిస్పీగా, క్రంచీగా కావాలనుకుంటే ముప్పహి నిమిషాల పాటూ బేక్ చేయండి.మీకు కావాలనుకుంటే కొన్ని చాక్లేట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేపుల్ సిరప్ తో ఎంజాయ్ చేయండి.ఈ రుచికరమైన కుకీస్ ట్రై చెయ్యండి. కచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకు పెద్దలకు బాగా నచ్చుతాయి.