కీరదోసకాయ పచ్చడి తయారు చెయ్యాల్సిన విధానం...  మిక్సీలోకి తురిమిన పచ్చి కొబ్బరి, పచ్చి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర మరియా ఇంగువను వేసి పదార్దాలను మెత్తటి పేస్ట్ ని చేసికోండి.పాన్ తీసుకోని అందులో కొద్దిగ నూనెను పోసుకొని వేడి చేయండి, నూనె కాగిన తరువాత కొద్దిగ ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు కరివేపాకులను వేసికొని అరనిమిషం లేదా ఒక నిమిషం పాటు వేయించండి.ఇంకో బౌల్ తీసుకోని అందులో కీరాదోసకాయ తురుమును అలాగే ఇంతకు ముందు మిక్సీలో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని కావలసినంత ఉప్పుని కూడా వేసుకొని అన్ని పదార్దాలను బాగా కలుపుకోవాలి. అలాగే ఇంతకు ముందు చేసి పెట్టుకున్న తాలింపును వేసుకోండి.ఇక రుచికరమైన కీరదోసకాయ పచ్చడి తయారైపోయినట్లే..