తయారు చేయు విధానం : ఓ బౌల్ తీసుకుని అందులో రాగిపిండిని వేయండి. ఇప్పుడు అందులో నీరు పోసుకుని దోశపిండిలా వచ్చేలా ఇలా కలుపుకోండి పిండిని.ఇప్పుడు కలుపుకున్న దోశ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. ఇప్పుడు పదార్థాలన్ని బాగా కలిసేలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి.దోశ పాన్ తీసుకుని మీడియం మంటపై పెట్టి వేడి చేయండి. ఇప్పుడు రాగి పిండిని తీసుకుని దోశలా వేయండి. ఇది మామూలు దోశపిండిలా వేయడానికి కుదరదు. కాబట్టి మీరు దోశ వేసుకునేటప్పుడే దోశ ఆకారంలో పిండిని వేయండి.దోశని నెయ్యితో రెండు వైపులా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చండి. అంతే ఎంతో హెల్దీ అంతే టేస్టీ రాగి దోశ సిద్ధమైనట్లే. ఈ దోశ ఏదైనా చట్నీతో, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది.