కోవా లడ్డులు ఎలా చెయ్యాలో తెలుసుకోండి.. ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేయండి. ఇప్పుడు అందులోనే కోవాని వేసి బాగా కలుపుతూ ఉండండి. అడుగు అంటుకోకుండా చూడండి.ఇప్పుడు అదే పాన్‌లో పంచదార వేసి కోవాలో పూర్తిగా కరిగిపోయేవరకూ చిన్న మంటపై ఉడికించాలి. ఇప్పుడు అందులోనే కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేయండి. మిశ్రమం మరింత చిక్కగా ఉందనుకుంటే అందులో కొద్దిగా నెయ్యి వేస్తూ కలపండి.ఇప్పుడు పదార్థాలన్ని బాగా ఉడికేలా ఓ ఐదు నుంచి 7 నిమిషాల వరకూ ఉడికించండి. పదార్థాలు దగ్గర పడే వరకూ ఇలా ఉడికించండి. ఇప్పుడు ఈ డిష్‌ని చల్లారనివ్వండి.కోవా కొద్దిగా చల్లబడిన తర్వాత.. మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కోవా లడ్డూలు తయారైనట్లే..