రుచికరమైన నోరూరించే దోసకాయ చపాతీ లేదా దోసకాయ రొటీనీ తయారు చేయు విధానం....  ముందుగా బౌల్ తీసుకుని అందులో తురిమిన దోసకాయ, కొబ్బరి, కరిపాకు తురుము వేయండి. ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి.. వీటన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమంలో రవ్వ వేసి అన్నీ పదార్థాలు బాగా కలిసేలా కలపండి.ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని తీసుకుని రోటీల్లా చేయండి..ఇలా తయారైన రోటీని రెండు వైపులా తక్కువ మంటపై కాల్చండి. అంతే సింపుల్ దోసకాయ రోటీ లేదా దోసకాయ చపాతి తయారు అయిపోయినట్లే.. వీటిని వేడి వేడిగా చట్నీ లేదా సాంబర్తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.