రుచికరమైన గోధుమ పిండి హల్వా తయారు చేసే విధానం చూడండి....  ఓ పాన్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి, అందులోనే తురిమిన జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసి కొద్దిగా వేయించండి.ఇప్పుడు అదే పాన్లో గోధుమపిండిని వేసి బాగా వేయించండి. పిండి మొత్తం నెయ్యిని పీల్చుకునేవరకూ వేయించాక.. అందులో ఎండికొబ్బరిని వేసి బాగా కలపండి.ఇప్పుడు మరో పాన్లో బెల్లం, నీరు వేసి వేడి చేయండి. నీటిలో బెల్లం పూర్తిగా కరిగేవరకూ 5 నిమిషాల వరకూ వేడి చేయండి. బాగా వుడికిన తరువాత రుచికరమైన బెల్లం పాకం తీసుకోండి  ఇప్పుడు బెల్లం పాకంలో గోధుమపిండిని వేసి కలుపుతూ ఉండండి. అలా కలిపిన తరువాత బెల్లం పాకం గోధుమపిండిలో కలిసే వరకూ ఉండలు లేకుండా ఉండేలా కలిపి ఉడకనివ్వండి.హల్వా దగ్గరపడగానే అందులో కొద్దిగా నెయ్యి వేసి కలపండి. ఇప్పుడు స్టౌ ఆపివేసి వేడివేడిగా సర్వ్ చేయండి.. రుచికరమైన గోధుమ పిండి హల్వాని బాగా ఎంజాయ్ చేస్తూ తినండి...