రుచికరమైన కరమైన బాదుషాలు కోసం ముందుగా ఓ బౌల్లో పావుకప్పు నీటిని తీసుకోవాలి. అందులో కరిగించిన నెయ్యి, సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో మైదా వేసి కలపండి. తర్వాత అందులో పెరుగు వేసి కలిపి పక్కనపెట్టండి..ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో ఒక కప్పు పంచదార, అరకప్పు నీరు వేసి పాకం పట్టాలి.మైదా మిశ్రమాన్ని తీసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా కట్ చేసి వాటిని బాదుషా ఆకృతిలో చేయాలి..ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయ్యాక తయారైన బాదుషాలని వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించండి. వేయించిన బాదుషాలను ఇప్పుడు పంచదార పాకంలో వేయండి. అరగంట తర్వాత ఈ బాదుషాల రుచిని మీరు ఆస్వాదించండి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...