చిక్కుడు గింజల పులావ్ తయారికి ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేగాక అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.ఆ పోపు మిశ్రమంలోనే పసుపు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించిన చిక్కుడు గింజలు వేసి బాగా కలపాలి. అందులోనే తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ పోపు మిశ్రమంలోనే ఉడికించిన అన్నం వేసి కలపాలి. తర్వాత అందులో మెంతి పొడి, ఉప్పు వేసి మరోసారి పదార్థాలన్నీ కలిసిపోయేలా కలపండి.చివరిగా కొబ్బరి తురుము వేసి కలపండి. అంతే టేస్టీగా ఉండే చిక్కుడు గింజల పులావ్ సిద్ధమైనట్టే..