ఓట్స్ ఇడ్లి తయారీకి..మొదట బాణలిలో ఓట్స్ వేసి కాస్త రంగు మారేవరకూ వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్ పొడిలో కలపాలి.అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే వేడివేడి ఓట్స్ ఇడ్లీలు రెడీ అయినట్లే..ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ఈ ఆరోగ్యకరమైన ఇడ్లిని ట్రై చేసి చూడండి..ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది డైలీ తింటే పిల్లలు చాలా పుష్టిగా బలంగా ఉంటారు...