పాలకూర సూప్ తయారుచేయు విధానం...మొదట పాలకూర కట్టలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆకులను సన్నగా తరగాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో పాలకూర తరుగు, కప్పు కందిపప్పు తీసుకోవాలి. దీనికి రెండు కప్పుల నీటిని కలపాలి. స్టౌ వెలిగించి... నాలుగు విజిల్స్ వచ్చేవరకు పాలకూర, కందిపప్పును ఉడికించుకోవాలి. ఒక మందంపాటి గిన్నెను స్టౌమీద పెట్టి... తగినంత నూనె లేదా కొద్దిగా బట్టర్ వేసుకోవాలి. అందులో తరిగిన పచ్చిమిర్చి, మిరియాలపొడి, జీలకర్ర పొడి, వేయాలి. తర్వాత ఇందులో ఉడికించుకున్న పాలకూర, కందిపప్పు వేయాలి. ఇందులో ఒక కప్పు నీళ్లు పోయాలి. కాస్తా చిక్కగా అయ్యే వరకు ఆగి... తగినంత ఉప్పు, నిమ్మరసం కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.ఇక పాలకూర సూప్ తయారైనట్లే....