ఉసిరికాయ చిప్స్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి... ముందుగా ఉసిరికాయలని బాగా కడిగి పొడిగా తుడవండి. అందులో నుండి గింజలు తీసేసి చిన్న చిన్న స్లైసులుగా కట్ చేయండి. బ్లాక్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కలిపి ఉసిరికాయ స్లైసులకి బాగా పట్టేలా కలపండి.వీటిని మైక్రో వేవ్ ఒవెన్ సేఫ్ ప్లేట్ లో ఉంచి నాలుగైదు నిమిషాలు మైక్రో వేవ్ చేయండి. లేదా, ఒక పెద్ద పళ్ళేం లో వీటిని పరిచి సుమారుగా ఒక వారం రోజులు, లేదా ఉసిరికాయ ముక్కలు క్రిస్పీగా డ్రైగా అయ్యేవరకూ ఎండబెట్టండి.ఇప్పుడు వీటిని ఒక గాలి చొరని డబ్బాలో నిలవ ఉంచుకోండి. ఈ డబ్బాని చల్లగా పొడిగా ఉండే ప్రదేశం లో ఉంచండి. ఫ్రిజ్ లో మాత్రం కాదు. సంవత్సరం పొడవునా వీటి హెల్త్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయండి. వీటిని ఇంట్లో తయారు చేసుకుని రోజూ హెల్దీ న్యూట్రియెంట్స్ ని తీసుకోండి.ఇక ఈ చిప్స్ ని రోజు స్నాక్స్ గా తీసుకోండి. అలాగే మీ పిల్లలకి కూడా అలవాటు చెయ్యండి. చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాల గురించి తెలుసుకోండి...