డబల్ కా మీఠా తయారీ విధానం....ముందుగా చెయ్యాలసింది ఏంటంటే బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ లేయర్‌ని తీసేయాలి. త్రిభుజాకారం వచ్చే విధంగా బ్రెడ్‌ని ముక్కలు చేయాలి. ఇప్పుడు స్టౌపై పాత్ర పెట్టి.. దానిలో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే పాత్రలో సారపపప్పు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగించి దించేయాలి. మరిగించిన పాలలో వేయించుకున్న బ్రెడ్ ముక్కలు, యాలకులపొడి వేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసుకొని చక్కెర వేసి మరగనివ్వాలి. ఈ పాకాన్ని పాలలో పోయాలి. పైన జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు వేసి గార్నిష్ చేయాలి. ఇక తియ్యటి డబుల్ కా మీఠా రెడీ అయినట్లే... మీరు ఇంట్లో ట్రై చెయ్యండి.. ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రెసిపీస్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...