చికెన్ టిక్కా తయారు చేసే విధానం: మొదటగా చికెన్ టిక్కా తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఓ గిన్నెలో చికెన్ తీసుకొని... నిమ్మరసం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి సెనగపిండి, కారం, పసుపు, మిరియాలపొడి, గరం మసాల పొడి, బిర్యానీ మసాల, రుచికి తగినంత ఉప్పు, మిగిలిన ఇతర పదార్థాలను కలపాలి. చివరగా ఈ మిశ్రమానికి పెరుగు కలిపి అరగంట నుంచి గంట వరకు ఫ్రిజ్లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి చికెన్ ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చుకొని... నిప్పులమీద కాల్చాలి. అన్ని వైపులా కాలేలా... చువ్వలను తిప్పుతూ ఉండాలి. అవసరమైతే కాల్చే సమయంలో ముక్కలపై బటర్ కానీ, కొద్దిగా ఆయిల్ గాని వేసుకొని కాల్చుకోవచ్చు. వీటిని పుదీనా పెరుగు పచ్చడితో తింటే మంచి రుచిగా ఉంటుంది. సులభంగా కూడా జీర్ణమవుతుంది.