కొబ్బరి బొబ్బట్లు తయారు చేయు విధానం.... ఓ గిన్నెలో మైదా, పసుపు, ఉప్పు కాస్త నీళ్లు వేసి పిండిలా కలపాలి. అందులో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపాలి. బొబ్బట్లకు ఎంత పదునుతో పిండిని కలుపుకుంటామో అలాగే కలుపుకుని ఓ 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు, బెల్లం తురుము వేసి కరిగించాలి. మలినాలుంటే తీసేయాలి. ఆ బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ బెల్లం మిశ్రమంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఆ బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టాలి. తేమ పోయేంత వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ఉండలా చుట్టి చేత్తొనే పూరీ లా ఒత్తి మధ్యలో... కొబ్బరి మిశ్రమం పెట్టాలి. అంచుల్నీ మూసేసి... మళ్లీ గుండ్రంగా ఒత్తేయాలి. పెనం మీద నెయ్యి వేసి బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. సర్వ్ చేసే ముందు బొబ్బట్లపై ఓ చుక్క నెయ్యి వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది.