చిరుధాన్యాల కుకీస్ తయారీ విధానం...   ఒక డీప్ బౌల్ లో పటిక బెల్లం పొడిని జల్లెడ పట్టి వేయండి.రూమ్ టెంపరేచర్ లో బటర్ యాడ్ చేసి హ్యాండ్ బ్లెండర్ తో బీట్ చేయండి. ఈ మిశ్రమం లైట్ గా ఫ్లఫ్ఫీ గా అయ్యెవరకూ బీట్ చేయండి.ఇందులో జల్లెడ పట్టిన మైదా, ఊదల పిండి ని కలపండి. పిండి దగ్గరకి వచ్చేవరకూ చేతులతో బాగా కలపండి. మరీ అవసరమనుకుంటే కొన్ని చుక్కలు గోరు వెచ్చని పాలు పోసి కలపండి. ఈ పిండిని ముప్ఫై నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి.ఆ తరువాత ఈ పిండిని అప్పడాల కర్రతో వత్తండి.  మీకు కావాల్సిన షేప్ లో కట్ చేయండి .ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 - 25 నిమిషాలు, లేదా కుకీలు అంచుల వద్ద బ్రౌన్ గా అయ్యేవరకూ బేక్ చేయండి. ప్రతి పది నిమిషాలకీ ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండిఅయిపోయిన తరువాత వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తరువాత పీనట్ బటర్, షుగర్ గ్లేజ్, స్ప్రింక్లర్స్, లేదా డార్క్ చాకొలేట్ గనాష్ తో డెకొరేట్ చేయండి. మీ పిల్లల్ని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తే వారికీ సరదాగా ఉంటుంది. ఇవి మిల్లెట్స్ తో చేశారు కాబట్టీ వాటిని ఆ రోజే తినేయండి.పిల్లలు వీటిని పాలతో కలిపి తినడానికి ఇష్టపడతారు..