క్రిస్మస్ ప్లమ్ కేక్ తయారు చేయు విధానం...అడుగు మందంగా ఉన్న సాస్ పాన్ ని లో నుండి మీడియం హీట్ మీద ఉంచి అందులో ఆరెంజ్ జ్యూస్, నిమ్మ రసం, నీరు పోయండి. ఇందులోనే టూటీ ఫ్రూటీ, రైజిన్స్, డ్రైడ్ యాప్రికాట్స్, ప్రూన్స్, క్రాంబెర్రీస్ కలపండి. డ్రై ఫ్రూట్స్ ఈ జ్యూసులని అబ్జార్బ్ చేసుకుని సిరప్ చిక్కబడే వరకూ మంట మీదే ఉంచండి.ఆ తరువాత పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇందులోనుండి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తరవాత వాడడం కోసం పక్కన పెట్టండి. ఈ లోపు ఓవెన్ ని 160 డిగ్రీ సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేయండి. గుండ్రంగా ఉండే కేక్ పాన్ తీసుకుని దాని లోపల వైపున బటర్ పూయండి లేదా పార్చ్మెంట్ పేపర్ ఉంచండి. ఒక గ్లాస్ బౌల్ లో డ్రై ఇన్గ్రీడియెంట్స్ అన్నీ వేసి కొంత ఆరెంజ్ జెస్ట్ కూడా కలిపి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచండి.వేరే బౌల్ లో బ్రౌన్ షుగర్, ఆయిల్ వేసి మిశ్రమం చిక్కబడేవరకూ మిక్స్ చేయండి. ఆ తరువాత ఇందులోనే యోగర్ట్ కూడా కలిపి మళ్ళీ బాగా మిక్స్ చేయండి.చివరగా వనిల్లా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసి అన్నింటినీ డ్రై ఇన్గ్రీడియెంట్స్ తో కలపండి.అన్నీ పూర్తిగా కలిసేవరకూ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు సోక్డ్ డ్రై ఫ్రూట్స్, సన్నగా తరిగిన వాల్నట్స్, బాదం పప్పు, జీడి పప్పు కలిపి ఫోల్డ్ చేయండి. ఈ మొత్తం మిశ్రమాన్ని కేక్ పాన్ లోకి తీసుకోండి. 160 డిగ్రీ సెల్సియస్ వద్ద యాభై నుండి యాభై ఐదు నిమిషాల పాటూ బేక్ చేయండి. ఇప్పుడు పక్కనుంచిన సోక్డ్ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.ఇక ఇలాంటి మరెన్నో కుకింగ్ రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..