పాలకూర దోశ తయారు చేయు విధానం..మినపప్పును, మెంతుల్ని నాలుగ్గంటల పాటూ నానబెట్టుకోవాలి. పాలకూరని బాగా తరిగి మిక్సీలో వేసుకుని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి. మినపప్పును, మెంతుల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలోకి ఆ మిశ్రామాన్ని తీసుకుని... అందులో పాలకూర ప్యూరీని కూడా కలపాలి. గోధుమ పిండి, ఉప్పు, తగినన్నీ నీళ్లు కూడా పోసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా గా కలపాలి. దోశెలు పోసుకోవడానికి వీలుగా అవసరమేతై నీళ్లు పోసి రుబ్బు పల్చగా ఉండేలా చేసుకోవాలి. ఆ రుబ్బుతో దోశెలు పోసుకుని కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు.