మ్యాంగో కేక్ తయారు చేయు విధానం.... ఒక గిన్నెలో మామిడిగుజ్జు, కోడిగుడ్ల సొన, వెన్న, పంచదార, వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలపాలి. అలాగే మరో గిన్నెలో గోధుమపిండి, చాకోచిప్స్, మైదా, బేకింగ్ సోడా, ఉప్మారవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి. కేక్ మౌల్డ్ లో కింద వెన్న రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఓవెన్ లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల వేడి చేయాలి. అనంతరం బయటికి తీస్తే... మ్యాంగో స్పాంజ్ కేక్ తినడానికి సిద్ధంగా ఉంది. పైన కావాలనుకుంటే కాస్త కొబ్బరి పొడి చల్లుకోవచ్చు.