కొత్తిమీర రైస్ తయారు చేయు విధానం... అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. అన్నం ముద్దగా కాకుండా... పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నెయ్యి వేసి... అందులో జీడిపప్పు వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఆవాలు జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించాలి. అనంతరం రుబ్బి పెట్టుకున్న కొత్తమీర మిశ్రమాన్ని వేసి కలపాలి. ఉప్పు కూడా వేయాలి. కొత్తిమీర పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. అనంతరం స్టవ్ కట్టేసి... కొత్తిమీర మిశ్రమంలో వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. పైన వేయించిన జీడిపప్పు చల్లి సర్వ్ చేయాలి.