శరీరం వేడి తగ్గించే పానకం తయారు చేయు విధానం...ఒక గిన్నెలో నీళ్లు పోసి తరిగిన బెల్లం వేయాలి. బెల్లం బాగా కరిగేవరకు అలా వదిలేయాలి. పూర్తిగా కరిగిపోయాక... నీటిని వడకట్టాలి. వడకట్టిన నీళ్లలో నిమ్మరసం, నల్లమిరియాల పొడి, శొంఠిపొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. తులసి ఆకులు కడిగేసి అందులో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా అయ్యాక రోజులో రెండు మూడు సార్లు తాగితే ఒంటి వేడి తగ్గుతుంది.