పల్లీల సలాడ్ తయారు చేసే విధానం.... ముందుగా ఓ గిన్నె లో పల్లీలు వేసి కాస్త ఉప్పు, నీళ్లు వేయాలి. అరగంట పాటూ ఉడికించి తీయాలి. నీళ్లన్నీ వంపేసి అందులో టమాటో తరుగు, ఉల్లితరుగు వేసి కలపాలి. అలాగే కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. కారం, ఉప్పు వేసి కలపాలి. చాట్ మసాలా వేసి బాగా కలపాలి. చివర్లో పైన నిమ్మరసం కలిపి సలాడ్ ను సర్వ్ చేయాలి. ఈ సలాడ్ ద్వారా శరీరానికి బోలెడన్నీ పోషకాలు లభిస్తాయి.