మిల్క్ కేక్ తయారు చేయు విధానం.... ముందుగా మందంగా ఉండే పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద మరిగించాలి. నిమ్మరసాన్ని పిండి నీళ్లలో కలిపి ఉంచాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కో చుక్కని అదులో కలుపుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పాలు విరిగిపోతాయి. కనుక పాలు విరిగిపోకుండా ఒక్కో చుక్క వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు ఇలా చేయాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార కలపాలి. తరువాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరకు చేరాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటు అడుగుకు నెయ్యి రాసి బాదం పిస్తా ముక్కలు చల్లాలి. దానిపై కోవా మిశ్రమాన్ని వేయాలి. ఒక ఆకారంలో ఆ మిశ్రమాన్ని సర్ది చిన్న ముక్కలుగా కోసుకోవాలి.