బంగాళా దుంప హల్వా తయారు చేయు విధానం....బంగాళాదుంపలను బాగా కడిగి పైన తొక్క తీసేయాలి. తరువాత వాటిని సన్నగా తరగాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. బంగాళాదుంపలను వేసి వేయించుకోవాలి. మంటలో సిమ్ లో పెట్టి తరుగును బాగా వేయించాలి. తరుగు మాడకుండా... ఎంత బాగా వేగితే అంత మంచి టేస్టు వస్తుంది. తరుగు బాగా వేగాక పాలు, పంచదార వేసి కలపాలి. ఆ మొత్తాన్ని బాగా ఉడికించాలి. కాస్త మెత్తటి ముద్దలాగా అవుతుంది మిశ్రమం. చూడడానికి హల్వాలా చిక్కబడుతున్నప్పుడు వేయించిన బాదం, జీడిపప్పు, యాలకులపొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుంటే సరి. బంగాళాదుంప హల్వా ముక్కలు తినడానికి సిద్ధం.