డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ తయారు చేయు విధానం.....   డ్రైప్రూట్స్ వేయించి మరీ మెత్తగా కాకుండా... పలుకుగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పాలు పోసి చిన్న మంట మీద మరిగించాలి. పాలు సగం అయ్యే వరకు మరిగించాలి. అనంతరం కోవా, డ్రైఫ్రూట్స్ తరుగు, కండెన్స్ డ్ మిల్క్ వేసి చిన్న మంట మీద మరిగించాలి. ఆ మిశ్రమం మొత్తం దగ్గరగా వచ్చి క్రీమీలా అయ్యేవరకు మరిగించాలి. ఆ సమయంలో పంచదార వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి. మిశ్రమం చల్లారాక కుల్పీ మౌల్ట్ లలో దానిని వేసి డీప్ ఫ్రిజ్ లో ఐదారు గంటలు ఉంచితే కుల్ఫీ సిద్ధమై పోతుంది.