మిల్క్ పౌడర్ లడ్డూ తయారీ విధానం....  ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పంచదార, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని.. పంచదార కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ స్టవ్ మీద పెట్టి.. చిన్న మంట మీద ఉంచి.. కొద్దికొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా ముద్దలా అయిపోయిన తర్వాత రెండు భాగాలుగా చేసుకుని, ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టుకుని  మరో భాగాన్ని పాన్లోనే ఉంచి మిగిలిన నెయ్యి వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలిపి.. పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిగా తీసి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న బాల్స్ చేసుకుని.. వాటిపైన ఫుడ్ కలర్ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక్కోబాల్ చుట్టూ పెట్టుకుని.. నిమ్మకాయ సైజ్లో లడ్డూలు చేసుకోవాలి.