ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి. చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు. మంచి రుచికరమైన చాక్లెట్ కొరికితే ప్రాణం జివ్వుమని మైండ్ కి ప్రశాంతంగా ఉంటుంది. అంత రుచికరంగా ఉంటాయి. ఇక చాకోలెట్స్ తో రుచికరమైన కేక్ పాప్స్  తయారు చేసుకోవచ్చు. ఈ పాప్స్ పార్టీల్లో, ఫంక్షన్స్ లో తినడానికి బాగుంటాయి. ఇక ఇవి ఎలా చెయ్యాలో తెలుసుకుందామా...!!

కావాల్సిన పదార్ధాలు....

ప్రధాన పదార్థం....

  • 1  చాకొలేట్ స్పాంజ్
  • 1/2 కప్ చాకొలేట్ సాస్

ప్రధాన వంటకానికి....

  • 2  డైజెస్టివ్ బిస్కెట్స్
  • 3 టీ స్పూన్ విప్డ్ క్రీం

చల్లబరుచుటకు...

అవసరాన్ని బట్టి చాకొలేట్ చిప్స్

అవసరాన్ని బట్టి కలర్ఫుల్ స్ప్రిన్కిల్స్

తయారు చేయు విధానం....

చాక్లెట్ స్పాంజ్ కేక్ ను పొడిగా చేసి, అందులో విప్డ్ క్రీమ్, పొడి చేసిన బిస్కెట్లను వేసి అన్ని పదార్థాలను పిండిగా కలపాలి. పదార్థాలు పొడిగా ఉంటే, అదనంగా కొంచం విప్డ్ క్రీమ్ జోడించవచ్చు. చివరగా, పిండి మృదువుగా ఉండేలా చూసుకోవాలి.ఈ పిండిని చిన్న చిన్న బంతుల్లా తయారుచేసి 2 నుండి 3 నిమిషాలు పక్కన ఉంచండి.

ఇప్పుడు లాలిపాప్ స్టిక్స్ తీసుకొని, ఒక చివరన చాక్లెట్ సాస్‌లో ముంచి ఆ బంతులకు గుచ్చి లాలీపాప్స్ రూపంలో తయారుచేయండి.ఇప్పుడు వీటిని ఒక గంట రిఫ్రిజిరేటర్లో ఉంచండి.ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుండి, ఈ కేక్ పాప్స్ తీసి, కరిగించిన చాక్లెట్‌లో ముంచి, దానిపై స్ప్రింక్లర్లను చల్లి, సర్వ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: