మెంతి కూర - చికెన్ కాంబో అదుర్స్..!
కావాల్సిన పదార్ధాలు :
చికెన్- అరకేజీ
మెంతికూర- మూడు కట్టలు
పసుపు- అర టీస్పూన్
ఉప్పు- సరిపడా
కారం- టేబుల్‌స్పూన్
పచ్చి మిర్చి- రెండు
ధనియాల పొడి- టీస్పూన్
కరివేపాకు- రెండు రెమ్మలు
అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్
సన్నగా తరిగిన ఉల్లి పాయలు- రెండు
టొమాటో- ఒకటి
జీలకర్ర- అరటీస్పూన్
గరం మసాలా పొడి- టీస్పూన్
కొత్తిమీర తరుగు- గుప్పెడు.
తయారీ విధానం :
ముందుగా మెంతికూర, చికెన్ శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.తరువాత ఒక గిన్నెలో చికెన్‌ను వేసి అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపాలి. తరువాత స్టవ్ వెలిగించి మెంతి కూర వేసి నూనెలో బాగా వేపాలి. వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే బాండీలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేపాలి. తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేపండి అవి వేగిన తరువాత ముందుగా నానపెట్టుకుని ఉంచిన చికెన్ వేయాలి.చిన్న మంట మీద ఉడికించండి. చికెన్ లో నీళ్లు ఇగిరిపోయి నూనె పైకి కనిపించిన తరువాత తర్వాత మెంతి కూర, గరం మసాలా పొడి వేయండి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లి దించేయండి. అంతే మెంతి కూర చికెన్ రెడీ అయినట్లే. ఈ కూరను అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నాగాని చాలా బాగుంటుంది.