ప్రేమికుల రోజు అన్ని జంటలూ సంబరాల్లో మునిగితేలితే ఓ జంట మాత్రం క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. పెద్దల్ని ఎదిరించలేక ప్రేమ చచ్చిపోయింది. అబ్బాయి సంగతి ఎలాఉందో ఎవరికీ తెలియదు కానీ, అమ్మాయి మాత్రం ప్రియుడు, కుటుంబ సభ్యుల మధ్య నలిగిపోయి ఉరేసుకుని చనిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండాలో జరిగింది.