దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ యువతిపై ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి వేధింపులకు దిగబోయాడు. ఆమె తెలివిగా అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసేసింది. అతడితో మాట్లాడటమే మానేసింది. దీంతో ఆ వ్యక్తి ఎలాగోలా ఆమె తల్లి ఫోన్ నెంబర్ ను కనుక్కోగలిగాడు. ఆమెకు నేరుగా వాట్సప్ లో ఓ మెసేజ్ పెట్టాడు.